అమరనాథ్ గుహ వద్ద భారీ వరద

Massive flood at Amarnath cave. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్‌నాథ్ గుహ దిగువన

By Medi Samrat
Published on : 8 July 2022 8:37 PM IST

అమరనాథ్ గుహ వద్ద భారీ వరద

శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అమర్‌నాథ్ గుహ దిగువన పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం చోటు చేసుకుంది. ఏజెన్సీ నివేదికల ప్రకారం.. NDRF, SDRF & ఇతర అనుబంధ ఏజెన్సీల ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌లు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గుహపై నుంచి నీరు వచ్చి చేరింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, అమర్‌నాథ్ గుహలో మేఘాలు విస్ఫోటనం చెందడంతో ఊహించని విధంగా వర్షం వచ్చేసింది. ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. రెస్క్యూ ఏజెన్సీలు అక్కడే ఉన్నాయి.

"కొన్ని లంగర్లు, టెంట్లు పవిత్ర గుహ వద్ద ఆకస్మిక వరదల కారణంగా ప్రమాదం బారిన పడ్డాయి.. ప్రస్తుతానికి రెండు మరణాలు నివేదించబడ్డాయి. పోలీసులు, NDRF అధికారులతో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిలో ఉంది. క్షతగాత్రులను తదుపరి చికిత్స కోసం విమానంలో తరలిస్తున్నారు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది'' అని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ అన్నారు.










Next Story