పూణెలో మంటలు చెలరేగి పేలుళ్లు.. ఎగిరిపడ్డ షట్లర్లు, కూలిన గోడలు
సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని పూణె నగరంలో రెండంతస్తుల భవనంలో ఉన్న మూడు దుకాణాలలో మంటలు
By అంజి Published on 1 May 2023 4:56 AM GMTపూణెలో మంటలు చెలరేగి పేలుళ్లు.. ఎగిరిపడ్డ షట్లర్లు, కూలిన గోడలు
సోమవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని పూణె నగరంలో రెండంతస్తుల భవనంలో ఉన్న మూడు దుకాణాలలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఏడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. తొలుత అప్లయన్స్ షోరూమ్‌లో మంటలు చెలరేగి ఇతర దుకాణాలకు వ్యాపించడంతో అపార నష్టం వాటిల్లింది. గృహోపకరణాలు, కిచెన్ ఉపకరణాలు, మొబైల్ ఫోన్‌లను విక్రయించే దుకాణాలు భారీ మంటల్లో చిక్కుకున్నాయి. దీని ఫలితంగా పేలుళ్ల కారణంగా రెండంతస్తుల భవనం దద్దరిల్లింది.
పూణె-సతారా రహదారిలో గృహోపకరణాలు, మొబైల్ ఫోన్‌లు విక్రయించే మూడు దుకాణాలలో "భారీ అగ్నిప్రమాదం" జరిగిందని అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. అప్లయన్స్ షోరూమ్‌లో మంటలు ఎగిసిపడడంతో కొద్దిసేపటికే సమీపంలోని దుకాణాలకు వ్యాపించి అపార నష్టం వాటిల్లింది. గాయపడిన వారిని వెంటనే వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లు చాలా శక్తివంతంగా ఉండటంతో షాపుల షట్టర్లు, గోడ స్తంభాలు కూలిపోయాయి, దుకాణాల్లోని ఇటుకలు, ఇతర వస్తువులు రోడ్డుపై ఎగిరిపోయాయని అధికారి తెలిపారు.
#WATCH Maharashtra: Two people have been reported injured in a fire that broke out at three different shops on Pune Satara Road near DMart. 7 fire tenders were on the spot to control the fire. The incident took place around 2.30 am. The fire is under control. pic.twitter.com/EURxfq767Z
— ANI (@ANI) May 1, 2023
పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో సమీపంలోని రోడ్ షాపుల షట్టర్లు దాదాపు 100 అడుగుల మేర హైవేకి అడ్డంగా ఎగిరి రోడ్డుపై చెత్తాచెదారం పడింది. "భారీ మంటల కారణంగా షోరూమ్ పక్క గోడలు కూలిపోయాయి. దాని ప్రభావంతో ప్రక్కనే ఉన్న భవనాల అద్దాలు కూడా విరిగిపోయాయి" అని అగ్నిమాపక అధికారి ఒకరు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున 2:22 గంటలకు అగ్నిమాపక దళం కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో ఆరు అగ్నిమాపక యంత్రాలు, రెండు నీటి ట్యాంకర్లను అక్కడికి పంపించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అగ్ని ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనం దగ్ధమైంది, ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారి తెలిపారు.