దేశ రాజధానిలోని ముండ్కా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఈ ఘటనపై సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో డిపార్ట్‌మెంట్‌కు కాల్ వచ్చిందని అధికారి తెలిపారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌లోని పిల్లర్ నంబర్ 544 సమీపంలో ఉన్న ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనం నుండి దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
సీసీటీవీ కెమెరాలు, రూటర్లను తయారు చేసే కంపెనీకి కార్యాలయంగా పనిచేస్తున్న భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ మూడంతస్తుల భవనాన్ని పలు కంపెనీలకు ఆఫీసు స్థలంగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అంబులెన్స్ కూడా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుంది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశమున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.