ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ ఇంద్రాపూర్ ప్రాంతంలోని జైపురియా షాపింగ్ మాల్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
కాగా.. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. కాగా.. అగ్నిప్రమాదం వల్ల ఎంత నష్టం వాటిల్లిందని అనే ఇప్పుడే అంచనాకు రాలేకపోతున్నామని అధికారులు తెలిపారు. అయితే.. ఈ షాపింగ్ మాల్ భారీ భవనాల మధ్య ఉండడం.. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. కాగా.. అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.