శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.
By Knakam Karthik
శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. శాంతియుత సంభాషణల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మోడీ ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందో లేదో స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి, ఆపరేషన్ కగార్‌ను ఆపడానికి ముందుకు రండి. శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ముందుకు రండి.. అంటూ పౌర హక్కుల ప్రజాస్వామ్యవాదులకు పిలుపునిచ్చారు.
కాగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇటీవలే ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు అడవిని మొత్తం జల్లెడ పట్టాయి. ఈ ఆపరేషన్‌లో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు అగ్రనేతలు కూడా ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టలు పేరుతో మావోయిస్టులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలపై సెర్చ్ కొనసాగించాయి. మావోయిస్టు ఆగ్రనేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున కూబింగ్ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తాము శాంతి చర్చలకు సిద్దమంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.