లిక్కర్ స్కామ్ లో మరోసారి సోదాలు

Manish Sisodia's Aide Being Questioned In Delhi Liquor Policy Case. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది.

By Medi Samrat  Published on  5 Nov 2022 5:00 PM IST
లిక్కర్ స్కామ్ లో మరోసారి సోదాలు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సన్నిహితుడి ఇంటిపై దాడులు చేసింది. ఈ కేసులో దేశ రాజధాని ఢిల్లీలో ఐదు ప్రదేశాల్లో రెయిడ్స్ జరుగుతున్నాయి. మనీష్ సిసోడియా సన్నిహితుడు దేవేంద్ర శర్మ సహా మరి కొంతమందిని ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలపై ప్రశ్నించారని జాతీయ మీడియా తెలిపింది. ఈ కేసులో దేవేంద్ర శర్మ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు.

దేవేంద్ర శర్మ అలియాస్ రింకూ దర్యాప్తుకు సహకరించడం లేదని ఈడీ పేర్కొంది. తన పీఏ అరెస్ట్ పై మనీష్ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతో ఈడీ దాడులు చేయిస్తోందని.. ఈడీ దాడులకు భయపడబోమని మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన సహాయకుడిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇంటిపై దాడి చేశారన్నారు. తన స్వగ్రామంలో కూడా తనిఖీలు నిర్వహించారని.. సరైన ఆధారాలు లభించలేదన్నారు. ఇప్పుడు తాజాగా తన పీఏ ఇంట్లో ఈడీ దాడులు చేసినా ఏమీ దొరక్కపోవడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారని మనీష్ సిసోడియా ఆరోపించారు.


Next Story