సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది: మనీశ్ సిసోడియా

Manish Sisodia targets BJP on CBI raids. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు..

By Medi Samrat  Published on  20 Aug 2022 7:30 PM IST
సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది: మనీశ్ సిసోడియా

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు.. ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) తన ఇంట్లో చేపట్టిన సోదాలపై స్పందించారు. తన ఇంట్లో 14 గంటల పాటు సోదాలు జరిపిన సీబీఐ అధికారులు తన కంప్యూటర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని.. తాను, తన కుటుంబ సభ్యులు సీబీఐ అధికారుల విచారణకు సహకరించామని అన్నారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. తాము ఏ అవినీతికీ పాల్పడలేదని, ఏ తప్పూ చేయలేదని చెప్పారు.

తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మ‌నీశ్ సిసోడియాను కూడా కేంద్ర ప్ర‌భుత్వం అరెస్టు చేయించే అవ‌కాశం ఉంద‌ని అర‌వింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని విమర్శలు చేస్తోంది ఆప్.


Next Story