ఆ ఫోన్ నా చేతికి వ‌చ్చే వ‌ర‌కు పెళ్లిచేసుకోను అంటూ ట్వీట్‌.. ఫ్రీగా ఇచ్చిన కంపెనీ

Man tweets he won't marry unless he has Mi 10T Pro. ఏ వ‌స్తువు అయిన‌ న‌చ్చితే.. దానిని కొనే వ‌ర‌కు నిద్ర‌పోరు.

By Medi Samrat  Published on  22 Dec 2020 6:31 AM GMT
ఆ ఫోన్ నా చేతికి వ‌చ్చే వ‌ర‌కు పెళ్లిచేసుకోను అంటూ ట్వీట్‌.. ఫ్రీగా ఇచ్చిన కంపెనీ

ఏ వ‌స్తువు అయిన‌ న‌చ్చితే.. దానిని కొనే వ‌ర‌కు నిద్ర‌పోరు. ఎలాగైనా స‌రే ఆ వ‌స్తువు సొంతం చేసుకోవాల‌ని భావిస్తారు. అయితే.. ఇక్క‌డ ఓ వ్య‌క్తికి ఓ ఫోన్ న‌చ్చింది. ఆ ఫోన్ కొనేవ‌ర‌కు పెళ్లి చేసుకోను అని ట్వీట్ చేశాడు. అయితే.. ఆ ట్వీట్‌కు స్పందించిన స‌దురు మొబైల్ కంపెనీ.. అత‌గాడికి న‌చ్చిన ఫోన్‌ను ఇంటికి పంపించింది. అంతేకాదండోయ్‌.. ఇక నిశ్చింతగా పెళ్లి చేసుకోవ‌చ్చు అని కామెంట్ కూడా చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.వివరాల్లోకి వెళితే.. కమల్ అహ్మద్ అనే వ్యక్తి ఈ నెల 11న ఎంఐ10టీ మొబైల్ తీసుకునే వరకు పెళ్లి చేసుకోనని ట్వీట్ చేశాడు. దీనికి మూడు నవ్వుతున్న ఎమోజీలు కూడా యాడ్ చేశాడు. అయితే.. డిసెంబ‌ర్ 21న సోమవారం మళ్లీ అతడే మరో ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్‌లో చేతిలో ఎంఐ10టీ ప్రో మొబైల్‌‌ను పట్టుకున్న ఫోటోలను అతడు పోస్ట్ చేయ‌డంతో పాటు దాని గుణ‌గ‌ణాల‌ను వ‌ర్ణించాడు. 'ఎట్టకేలకు ఈ రాక్షసి నా చేతికొచ్చింది. దీని డిస్‌ప్లే అదిరిపోయింది. ఈ ఫోన్ ఎంతో అందంగా ఉంది. అద్భుతమైన 108 ఎంపీ ఫ్లాగ్ షిప్ మొబైల్. ఇంకా ఎన్నో ఫీచర్స్. 40 వేల లోపు ఇంతకంటే బెస్ట్ మొబైల్ వేరే ఉండదు. షావోమీ ఇండియా, మనుకుమార్ జైన్‌లకు ఎంతో థాంక్యూ సో మచ్' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి మ‌నుకుమార్ జైన్ స్పందిస్తూ.. ఇక కమల్‌ పెళ్లికి రెడీ కావచ్చని ట్వీట్‌ చేశాడు.దీంతో అత‌డికి ఫోన్ ఫ్రీగా వ‌చ్చింద‌ని అంద‌రూ బావించారు. దీనిపై ఆరా తీయ‌గా.. ఎంఐ ఫ్యాన్‌ అయిన కమాల్‌ కంపెనీకి సంబంధించిన పలు ఇమేజ్‌ బిల్డింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొంటాడని, అనుకోకుండా తనకు లక్‌ కలిసివచ్చి ఫోను పొందేందుకు కూపన్‌ గెలుచుకున్నాడని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఏం అయితేనేం.. అత‌డికి ఫోన్ ఫ్రీగానే ల‌భించింది.


Next Story
Share it