వైర‌ల్ అవుతున్న వీడియో.. ఉమ్మివేస్తూ రోటీని తయారు చేస్తున్నారా..

Man spitting to make tandoori roti. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఉమ్మివేస్తూ రోటీని తయారు చేస్తున్

By Medi Samrat  Published on  12 Jan 2022 1:50 PM IST
వైర‌ల్ అవుతున్న వీడియో.. ఉమ్మివేస్తూ రోటీని తయారు చేస్తున్నారా..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఉమ్మివేస్తూ రోటీని తయారు చేస్తున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. రాజధాని లక్నోలో ఉమ్మి వేస్తూ రోటీని తయారుచేస్తున్న ఓ వీడియో బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో ఒక వ్యక్తి దాబా వద్ద ఉమ్మివేస్తూ తందూరీ రోటీని చేస్తున్న‌ట్లు కనిపిస్తుంది. ఆ వ్యక్తి చేసిన ఈ పనిని ఎవరో కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో అది వైర‌ల్‌గా మారింది. ఉమ్మివేస్తూ రోటీని ఎలా తయారు చేస్తున్నారో ఆ వీడియోలో కనిపిస్తోంది. అయితే.. ఈ వీడియో పోలీసులకు చేరడంతో.. పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసిన‌ట్లుగా నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు.

కాకోరిలోని ఇమామ్ అలీ హోటల్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. వీడియోలో ఓ వ్యక్తి ఉమ్మివేస్తూ తందూరి రోటీని చేస్తున్నాడు. వైర‌ల్ అయిన ఈ వీడియోపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు ట్విట‌ర్‌లో వీడియోను షేర్ చేసిన వ్య‌క్తి రాసుకొచ్చాడు. ఈ విష‌య‌మై కకోరి పోలీసులు.. హోటల్ యజమాని యాకూబ్ తో పాటు అక్క‌డ ప‌నిచేసే న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన‌ట్లు న్యూస్ ట్రాక్ లైవ్ సంస్థ‌ వార్తా రాసింది.

వీడియోలో.. ఓ వ్యక్తి రోటీ చేస్తుండ‌గా.. అతని ప‌క్క‌న‌ మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వ్యక్తి రోటీలో ఉమ్మివేసి, ఆపై వండడానికి తాండూరులో వేస్తాడు. ఈ వీడియోను చాలా దూరం నుండి ఎవరో రహస్యంగా కెమెరాలో బంధించారు.. అయితే స్పష్టంగా క‌నిపించ‌క‌పోయినా.. రోటీలో ఉమ్మివేయడం ఖచ్చితంగా కనిపిస్తుందని న్యూస్ ట్రాక్ లైవ్ త‌న‌ క‌థ‌నంలో పేర్కొంది. అయితే.. ఇంత‌కుముందు కూడా ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ట్లు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఏదేమైనా.. తినే ఆహారంలో ఉమ్మి వేయ‌డాన్ని చాలామంది ఖండించారు. ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న వీడియోపై అస‌లు నిజ‌మేంటో తెలియాల్సివుంది.


Next Story