చెంపదెబ్బకు చెప్పు దెబ్బతో సమాధానం.. అస‌లేం జ‌రిగిందంటే..

Man Slaps Woman Toll Booth Employee When Asked To Pay Tax. మధ్యప్రదేశ్‌లో టోల్ టాక్స్ చెల్లించకుండా వెళుతున్న ఓ వ్యక్తిని అందులో

By Medi Samrat  Published on  21 Aug 2022 9:15 PM IST
చెంపదెబ్బకు చెప్పు దెబ్బతో సమాధానం.. అస‌లేం జ‌రిగిందంటే..

మధ్యప్రదేశ్‌లో టోల్ టాక్స్ చెల్లించకుండా వెళుతున్న ఓ వ్యక్తిని అందులో పని చేస్తున్న ఓ మహిళ అడ్డుకుంది. అయితే నన్నే ఆపుతావా అంటూ ఆమెను కొట్టాడు సదరు వ్యక్తి. మహిళా ఉద్యోగిని చెంపదెబ్బ కొట్టాడు. ఆ వ్యక్తి కోపంగా ఉద్యోగి వైపు వచ్చి ఆమెను ముఖం మీద కొట్టిన ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ CCTV ఫుటేజీ వైరల్ అవుతోంది. చెంప దెబ్బ కొట్టిన వ్యక్తికి ఆ మహిళ తన చెప్పుతో బుద్ధి చెప్పింది.

రాజ్‌కుమార్ గుర్జార్ కారుకు ఫాస్ట్‌ట్యాగ్ లేదు. తాను స్థానికుడినని, అందువల్ల టోల్ ఛార్జీలు చెల్లించకుండా మినహాయించాలని కోరారు. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాలని ఆమె కోరగా.. అవి తన దగ్గర లేవని చెప్పాడు. పత్రాలు చూపించిన తర్వాతనే అక్కడి నుండి వెళ్లాలని.. లేదంటే టోల్ ఫీజు కట్టాలని ఆ ఉద్యోగిని కోరింది. దీంతో రాజ్ కుమార్ కు కోపం వచ్చి ఆమెపై చేయి చేసుకున్నాడు. రాజ్‌గఢ్-భోపాల్ రోడ్డులోని కచ్నారియా టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది.

"అతను స్థానికుడని చెప్పాడు. నేను వెళ్లి సూపర్‌వైజర్‌కి సమాచారం ఇచ్చాను. సూపర్‌వైజర్ నన్ను ఆ వ్యక్తి తెలుసా అని అడిగాడు. నేను తెలియదని అని చెప్పాను.. ఆ వ్యక్తి తన వాహనం నుండి దిగి, దుర్భాషలాడాడు. నన్ను కొట్టాడు. నేను కూడా అతనిని తిరిగి కొట్టాను" అని టోల్ బూత్ ఉద్యోగి అనురంద డాంగి అన్నారు. ఏడుగురు మహిళా ఉద్యోగులున్న బూత్‌ లో గార్డులు ఎవరూ లేరని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదైంది కానీ నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు.




Next Story