మనిషి మాంసం తినాలనే పిచ్చి.. చివరకు..!
కొన్నిసార్లు హత్య కంటే, హత్య వెనుక ఉన్న ఉద్దేశమే దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంది.
By - Medi Samrat |
కొన్నిసార్లు, హత్య కంటే, హత్య వెనుక ఉన్న ఉద్దేశమే దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని దిన్హాటిలో జరిగిన ఇలాంటి హత్య కేసులో, హత్యకు గల ఉద్దేశాలను వెల్లడించారు స్థానిక పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత పోలీసులు హత్య కేసులో నరమాంస భక్షణ ఉందని తేలింది. స్మశానంలో గుర్తు తెలియని వ్యక్తిపై దారుణంగా దాడి చేసి చంపారని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది.
మనిషి మాంసాన్ని తినాలనే ఉద్దేశ్యంతో ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన బెహార్ జిల్లాలో కలకలం సృష్టించింది. గుర్తు తెలియని యువకుడి మెడ, గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతుడి గుర్తింపు ఇంకా నిర్ధారించలేదు. మృతుడు శ్మశాన వాటికలో ఒక గుడిసెలో నివసించినట్లు సమాచారం. ఈ కేసులో ఫిర్దౌస్ ఆలం అనే యువకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, హత్య తర్వాత మృతదేహాన్ని నీటి కుళాయి వద్దకు తీసుకెళ్లి శుభ్రం చేసి, తరువాత దాచిపెట్టాడని చెప్పారు. నిందితుడు మృతుడి శరీరంలోని కొన్ని భాగాలను తినాలని అనుకున్నాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.