పోలీసుగా అవతారం ఎత్తిన గ్యాంగ్ స్టర్.. అమ్మాయిలతో మెసేజీలు, వీడియో కాల్స్ చేయిస్తూ..

Man Held for Killing a Youth for Harassing His Daughter in Karnataka. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దేశ రాజధానిలో 'సెక్స్‌టార్షన్' రాకెట్‌ను ఛేదించింది.

By Medi Samrat  Published on  6 Dec 2021 2:31 PM IST
పోలీసుగా అవతారం ఎత్తిన గ్యాంగ్ స్టర్.. అమ్మాయిలతో మెసేజీలు, వీడియో కాల్స్ చేయిస్తూ..

ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ దేశ రాజధానిలో 'సెక్స్‌టార్షన్' రాకెట్‌ను ఛేదించింది. డజన్ల కొద్దీ కొందరు వ్యక్తులను మోసం చేసి వారి నుండి కోటి రూపాయలకు పైగా దోచుకున్నారు. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు సభ్యుల ముఠా 2020లో మొదటి లాక్‌డౌన్‌కు ముందు తన కార్యకలాపాలను ప్రారంభించిందని పోలీసు అధికారులు తెలిపారు. హర్యానాలోని బహదూర్‌ఘర్‌కు చెందిన నీరజ్‌ ఈ గ్రూప్ కు హెడ్ గా ఉన్నాడు. సెక్టార్-14, ప్రశాంత్ విహార్, రోహిణి ప్రాంతంలో ఉన్న పివిఆర్ సినిమా హాల్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.

నిందితులు ఒక అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను సృష్టించి.. వాళ్లు లక్ష్యంగా చేసుకున్న వారికి 'ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు' పంపేవారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా అమ్మాయిగా నటిస్తూ చాట్ చేస్తూ ఉంటారు. వాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తులకు అడల్ట్ కంటెంట్‌ను పంపి.. వలపు వల విసిరేవారని పోలీసులు తెలిపారు. ముఠాలోని మహిళా సభ్యురాలు బాధితులను మరింత ప్రలోభపెట్టడానికి వీడియో కాల్ చేయిస్తారు.

సదరు టార్గెట్ చేసిన వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేది. ఎంత వరకూ కట్టగలడు.. ఎంత వరకూ రాబట్టుకోవచ్చు అనే విషయాల కోసం ఆర్థిక నేపథ్యం గురించి తెలుసుకునే వారు. ముఠాలోని మహిళా సభ్యురాలు ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి వ్యక్తులను ఆహ్వానించి లైంగిక చర్యకు పాల్పడేవారు. ఆ సమయంలో ముఠాలోని ఇతర సభ్యులు పోలీసుల వలె నటిస్తూ గదిలోకి ప్రవేశిస్తారు. పోలీసులు రైడ్ చేసినట్లు బాధితులు నమ్మేవారు. ఆ తర్వాత ముఠా సభ్యులు 'పోలీసులు'గా నటిస్తూ బాధితులని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా ఈ ముఠా గత ఏడాదిన్నర కాలంలో డజనుకు పైగా బాధితుల నుంచి వసూళ్లకు పాల్పడింది. ఒక్కో బాధితుడి నుంచి రూ.5-10 లక్షలు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. మిగతా బాధితులను కనిపెట్టేందుకు మిగిలిన ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామని అదనపు పోలీసు కమిషనర్ ధీరజ్ కుమార్ తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించామని విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు.


Next Story