బాల్కనీకి వేలాడుతూ క‌నిపించిన వ్య‌క్తి.. త‌ర్వాత ఏమ‌యిందంటే..

Man Hanging From Balcony Pulled Up By Family In UP's Ghaziabad. ఘజియాబాద్‌లోని ఓ వ్యక్తి బాల్కనీలో వేలాడుతూ కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు

By Medi Samrat  Published on  18 April 2022 8:24 PM IST
బాల్కనీకి వేలాడుతూ క‌నిపించిన వ్య‌క్తి.. త‌ర్వాత ఏమ‌యిందంటే..

ఘజియాబాద్‌లోని ఓ వ్యక్తి బాల్కనీలో వేలాడుతూ కనిపించడంతో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రెండంతస్తుల భవనంలోని మొదటి అంతస్తు బాల్కనీకి వేలాడుతున్న వ్యక్తి వీడియోలో కనపడతాడు. కొందరు వ్యక్తులు అతని చేయి పట్టుకుని పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

లోని ఈక్రమ్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్కనీలో వేలాడుతున్న వ్యక్తిని చూసిన భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని కుటుంబ సభ్యులు మరియు చుట్టుపక్కలవారు మొదటి అంతస్తులో గుమిగూడి వ్యక్తిని పైకి లాగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఫిబ్రవరిలో ఫరీదాబాద్‌లోని ఓ మహిళ తన కుమారుడిని ఫరీదాబాద్‌లోని హైరైజ్‌లోని 10వ అంతస్తులో చీరతో వేలాడదీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కింద ఉన్న అపార్ట్‌మెంట్‌లో పడిపోయిన బట్టలు తెచ్చుకోవాలని ఆ మహిళ పిల్లవాడిని కోరింది. చిన్న చిన్న వాటికే ఇలాంటి రిస్కీ పనులు చేస్తూ ఉన్నారు.













Next Story