ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబానికి పెద్ద.. ఇక లేరు
Man From Mizoram, With World's Largest Family, Dies At 76. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు మరియు 33 మంది మనవరాళ్లతో ప్రపంచంలోని
By Medi Samrat Published on 13 Jun 2021 8:33 PM IST38 మంది భార్యలు, 89 మంది పిల్లలు మరియు 33 మంది మనవరాళ్లతో ప్రపంచంలోని అతిపెద్ద కుటుంబానికి యజమాని అయిన మిజోరాం వాసి 'జియోనా చానా' కన్నుమూశారు. 76 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. జియోనా చానా మరణాన్ని మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా ట్విట్టర్‌లో ధృవీకరించారు. "బక్తాంగ్ త్లాంగ్నుమ్ వద్ద ఉన్న అతని గ్రామం.. ఆయన కుటుంబం కారణంగా రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. 38 మంది భార్యలు మరియు 89 మంది పిల్లలతో ప్రపంచంలోని అతిపెద్ద కుటుంబానికి యజమానిగా ఉన్న జియోనా చానాకు తుది వీడ్కోలు" అంటూ ట్వీట్ చేశారు.
బక్తాంగ్ త్లాంగ్నుమ్ గ్రామం రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారడానికి ఆయనే కారణమట..! ఎంతో మంది విదేశీయులు ఆయన్ను, ఆయన కుటుంబాన్ని చూడడానికి వస్తూ ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి తెలిపారు.
జూలై 21, 1945 న జన్మించాడు. జియోనా ప్రసిద్ది చెందిన జియోనా చానా ఐజ్వాల్‌లోని ట్రినిటీ ఆసుపత్రిలో మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. అతనికి డయాబెటిస్ మరియు రక్తపోటు ఉంది. జియోనా చనా తన గ్రామంలో 'చనా శాఖ' అనే మత సమాజానికి అధిపతి. 17 సంవత్సరాల వయసులో తన కంటే మూడేళ్ళ పెద్ద యువతిని తొలిసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అతడు వరసగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. పర్వత గ్రామంలో 100 కి పైగా గదులతో ఉన్న నాలుగు అంతస్థుల బిల్డింగ్ 'చువాన్ థార్ రన్' లో మొత్తం కుటుంబం నివాసం ఉండేది. జియోనా చానా కుమారులు మరియు వారి భార్యలు మరియు వారి పిల్లలందరూ ఒకే భవనంలో వేర్వేరు గదులలో నివసిస్తున్నారు. అయితే అందరికీ వంటగది మాత్రం ఒక్కటే..! అతని భార్యలు అతని ప్రైవేట్ బెడ్ రూమ్ దగ్గర ఉన్న ఒక డార్మిటరీలో కలిసి ఉండేవారు.