Man chops off his finger to celebrate Nitish Kumar's victory. అభిమానం హద్దులు దాటంది. అభిమానం వెర్రి తలలేసింది.. అనే
By Medi Samrat Published on 24 Nov 2020 6:47 AM GMT
అభిమానం హద్దులు దాటంది. అభిమానం వెర్రి తలలేసింది.. అనే పదాలను వింటుంటాం. తాజాగా ఓ వ్యక్తి ఆ మాటలను దాటి తన అభిమానాన్ని చాటాడు. చాలా ఏళ్ల నుండి అలానే అభిమానాన్ని చాటుకుంటున్నాడు. బీహార్‌లోని జహానాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నితీష్ కుమార్ సీఎం అయిన ప్రతిసారి ఓ చేతి వేలును కత్తిరించుకుని భగవంతునికి సమర్పిస్తున్నాడు. తాజాగా మరోమారు నితీష్ సీఎం కావడంతో ఆ వ్యక్తి మరో వేలుని కత్తిరించుకుని గోరయ్య బాబా ఆలయంలో సమర్పించాడు.
వివరాళ్లోకెళితే.. జహానాబాద్‌కు చెందిన అనిల్ శర్మకు నితీష్ కుమార్ అంటే ఎంతో ఇష్టం. అందుకే అతను నితీష్ సీఎం అయిన ప్రతీసారీ ఒక్కో వేలుని కత్తిరించుకుంటూ వస్తున్నాడు. నితీష్ కుమార్ గతంలో సీఎంగా ఎన్నికైన మూడు సందర్భాల్లో 45 ఏళ్ల అనిల్ శర్మ ఉరఫ్ అలీ బాబా తన మూడు వేళ్లను కత్తిరించుకుంటున్నాడు.
తాజాగా నవంబరు 16న నితీష్ సీఎంగా ప్రమాణం చేసిన తరువాత అనిల్ మరో వేలిని కత్తిరించుకున్నాడు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఈ విధంగా చేయడం వలన తనకు ఆనందం లభిస్తుందని అన్నాడు. నితీష్ సీఎం కావాలని ఈ ఎన్నికల సందర్భంలోనూ మొక్కుకున్నానని.. తన కోరిక నెరవేరాక మొక్కు తీర్చుకున్నానని చెప్పాడు.