ట్రిపుల్ తలాక్ లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. మరో వైపు అలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అదనపు కట్నం కోసం భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తపై పోలీసులు కేసు నమోదుచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ హాపూర్‌కు చెందిన మహమ్మద్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి కట్నం కోసం తన భార్యను వేధిస్తూ ఉన్నాడు. దీంతో సెప్టెంబర్ 21న ఆమెకు ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తింటివారు తనను వేదిస్తున్నారని, ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ ఇచ్చాడని 32 సంవత్సరాల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే తన తండ్రి ఓ అపార్ట్‌మెంట్ కొనిచ్చాడని.. ప్రస్తుతం వారు అందులోనే ఉంటున్నారని ఫిర్యాదులో తెలిపారు. అది చాలదన్నట్లు మరో రూ.ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారని, తన పుట్టింటివారు ఆ మొత్తం ఇవ్వకపోడంతో గత నెలలో తనకు ఫోన్‌లో ట్రిపుల్ తలాఖ్ చెప్పాడని బాధితురాలు వాపోయింది.
దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి తన ఫిర్యాదులో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌కు చెందిన తన భర్త ఆస్ మహమ్మద్ ఖాన్ సెప్టెంబర్ 21న తనకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పాడని మహిళ ఆరోపించిందని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజయ్ వర్మ తెలిపారు. తన అత్తమామలు ఐదు లక్షల కట్నం డిమాండ్ చేస్తున్నారని, దాని కోసం తనను వేధించారని మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే ముస్లిం మహిళల (వివాహంపై హక్కుల పరిరక్షణ) చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం అతడిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.