ఘనవిజయం సాధించిన దీదీ

Mamata Banerjee wins Bhowanipore bypolls. భవానీపూర్‌ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై

By Medi Samrat  Published on  3 Oct 2021 9:45 AM GMT
ఘనవిజయం సాధించిన దీదీ

భవానీపూర్‌ ఉపఎన్నికలో మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం సాధించారు. కొద్ది రోజుల కిందట పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ పదవిలో ఆమె కొనసాగాలంటే అక్టోబర్‌ లోపు ఆమె ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉండగా.. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్‌ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉప ఎన్నికలో ఆమె ఎట్టకేలకు విజయాన్ని దక్కించుకున్నారు. ఇక ఎటువంటి టెన్షన్ లేకుండా మమతా అయిదేళ్ల పాటూ పశ్చిమ బెంగాల్ ను పాలించనున్నారు.

తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మ‌మ‌తా.. ఆ త‌ర్వాత ప్ర‌తి రౌండ్‌కూ త‌న ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఇది తృణ‌మూల్ కాంగ్రెస్ త‌ర‌ఫున కొత్త రికార్డు. గ‌తంలో 2011లో మ‌మ‌తా తొలిసారి ముఖ్య‌మంత్రి అయిన స‌మ‌యంలో ఆ పార్టీ త‌ర‌ఫున 49,936 ఓట్ల మెజార్టీ న‌మోదైంది. ఇప్పుడా రికార్డును మ‌మ‌తా బెన‌ర్జీ బ్రేక్ చేశారు. మొత్తంగా మ‌మ‌త‌కు 84,709 ఓట్లు రాగా ప్రియాంకాకు 26,320 ఓట్లు వ‌చ్చాయి. ల‌క్ష‌కుపైగా మెజార్టీతో గెలుస్తామ‌ని చెప్పార‌ని, ఇప్పుడు అది 50 వేల‌కే ప‌రిమిత‌మైంద‌ని ప్రియాంక తన ఓటమిని అంగీకరిస్తూ వ్యాఖ్యలు చేశారు. మ‌రోవైపు త‌న‌ను గెలిపించిన భ‌వానీపూర్ ప్ర‌జ‌ల‌కు మ‌మ‌త కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


Next Story