దేశంలో వాతావరణం బాగా లేదు : మమత బెన‌ర్జీ

Mamata Banerjee slams BJP. బీజేపీపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమత బెన‌ర్జీ విరుచుకుపడ్డారు.

By Medi Samrat  Published on  3 May 2022 4:36 PM IST
దేశంలో వాతావరణం బాగా లేదు : మమత బెన‌ర్జీ

బీజేపీపై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమత బెన‌ర్జీ విరుచుకుపడ్డారు. 'విచ్ఛేద శక్తుల' పట్ల బెంగాలీలు జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు. బీజేపీపై పోరాటం కొనసాగిస్తామన్నారు. అందరికీ 'అచ్ఛే దిన్' రావాలని ముఖ్యమంత్రి మమత సందేశం ఇచ్చారు. ఈద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రెడ్‌రోడ్‌లో ర్యాలీ నిర్వహించారు. అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు శాంతి సామరస్య సందేశాన్ని కూడా అందించారు. పేర్లు చెప్పకుండానే బీజేపీపై మమత విరుచుకుపడ్డారు.

మమత మాట్లాడుతూ.. 'నేను బెంగాల్ తరపున ప్రతి ఒక్కరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా శాంతి నెలకొనాలి. బెంగాల్‌లో ఉన్న ఐక్యత భారతదేశంలో మరెక్కడా కనిపించదని ప్రపంచం మొత్తం చూడాలి. కాబట్టి వారు అసూయపడతారు. అసూయపడే కొద్దీ అవమానిస్తారు. వారు నన్ను చాలా అవమానించారు. భ‌విష్య‌త్‌లో నన్ను మరింత అవమానిస్తారు.. నన్ను చేయనివ్వండి, నేను ఎవరికీ భయపడను. నేను పిరికిపంద‌ని కాను, అవిశ్వాసిని కాను. నేను పోరాడతాను, ఎలా పోరాడాలో నాకు తెలుసు. ఎలా చనిపోవాలో మాకు తెలుసు, ఎలా నిర్మించాలో మాకు తెలుసు. ఎలా పోరాడాలో మాకు తెలుసు. భయపడకు, పోరాడు అని ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగించారు. అలాగే.. ''దేశంలో వాతావరణం బాగా లేదు. విభజించి పాలించే విధానం మంచిది కాదు.. మాకు ఐక్యత కావాలి. భయపడకండి.. పోరాడుతూ ఉండండి, "అని మ‌మ‌త వ్యాఖ్యానించారు.










Next Story