Breaking: మమతా బెనర్జీ తలకు గాయాలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

By Medi Samrat
Published on : 24 Jan 2024 11:01 AM

Breaking: మమతా బెనర్జీ తలకు గాయాలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె తకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. బుధవారం బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వర్షం కారణంగా ఆమె రోడ్డు మార్గం ద్వారా కోల్ కతాకు ప్రయాణిస్తూ ఉన్నారు. పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా డ్రైవర్ అకాస్మత్తుగా బ్రేకులు వేయడంతో ముఖ్యమంత్రి గాయపడ్డారు.

మూలాల ప్రకారం, ప్రతికూల వాతావరణం కారణంగా మమతా బెనర్జీ కారులో తిరిగి వస్తున్నారు. ఆమె కాన్వాయ్‌కు అకస్మాత్తుగా ఓ కారు ఎదురుగా వచ్చింది, దాని కారణంగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో ముఖ్యమంత్రి గాయపడ్డారు. తృణమూల్ అధినేత్రి తలకు స్వల్ప గాయాలు కాగా, ఆమెను కోల్‌కతాకు తీసుకువస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story