డ్యాన్స్ చేసిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్
Mamata Banerjee Breaks Into Dance. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి
By Medi Samrat Published on 24 Dec 2020 10:04 AM GMTపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి డ్యాన్స్ చేశారు. తాజాగా మ్యూజిక్ ఫెస్టివల్‌ను మమత ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు. పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో మమతా బెనర్జీ పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జనంతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజిషియన్లు, గాయకులు, నృత్యకారులు నిర్వహించిన మ్యూజిక్ ఫెస్ట్‌లో ఆమె పాల్గొన్నారు.
ఆ రాష్ట్రానికి చెందిన ఫేమస్ సంతల్ డ్యాన్సర్ బసంతీ హేమ్‌బ్రమ్‌ను సీఎం మమతా బెనర్జీ సన్మానించారు. అయితే స్టేజ్‌పై స్టెప్పులేస్తున్న బసంతితో.. మమతా కూడా కాళ్లు కదిపారు. తనకు స్టెప్పులు నేర్పించాలంటూ అడిగిన దీదీ.. అదే ఊపులో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యాన్స్ అనంతరం మమత బెనర్జీ.. తన ప్రసంగంలో బీజేపీపై విమర్శనాస‌్త్రాలు ఎక్కుపెట్టారు. బెంగాల్‌ను ఎన్నటికీ గుజరాత్‌లా మార్చమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశార. జాతీయ గీతం, జై హింద్ లాంటి స్లోగన్స్ అన్నీ బెంగాల్‌లోనే పుట్టాయని గుర్తు చేశారు. ఏదో ఒక రోజు ప్రపంచం మొత్తం బెంగాల్‌కు సెల్యూట్ చేసే రోజు వస్తందని గర‌్వంగా చెప్పారు.