మహారాష్ట్రలోని జల్గావ్‌లో శుక్రవారం పెను ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్ ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కులో ధాన్యం లోడ్‌తో నిండి వుంది. అమరావతి ఎక్స్‌ప్రెస్ జలగావ్‌లోని బోద్వాడ్ మీదుగా వస్తుంది.. పాత రైల్వే గేటు మీదుగా లారీ వెళ్తోంది.. ఈ క్రమంలోనే ఆగకుండా వస్తున్న ట్రక్కు నేరుగా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా తుక్కుతుక్కయ్యింది. రైలు ఇంజన్ కూడా బాగా దెబ్బతింది. రైలు ముందు భాగంలో మంటలు చెలరేగాయి.. అయితే వెంటనే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రైలులోని ప్రయాణికులెవరూ గాయపడకపోవడం విశేషం. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాదంతో ఘటనా స్థలంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.