ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మావోల మందుపాతర.. 9మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం అబుజ్‌మద్‌లోని దక్షిణ ప్రాంతంలో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ తర్వాత తిరిగి వస్తున్న సైనికుల పికప్ వాహనాన్ని నక్సలైట్లు పేలుడు పదార్థాలతో పేల్చివేశారు.

By Medi Samrat  Published on  6 Jan 2025 5:30 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మావోల మందుపాతర.. 9మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు భారీ దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం అబుజ్‌మద్‌లోని దక్షిణ ప్రాంతంలో నక్సలైట్లతో ఎన్‌కౌంటర్ తర్వాత తిరిగి వస్తున్న సైనికుల పికప్ వాహనాన్ని నక్సలైట్లు పేలుడు పదార్థాలతో పేల్చివేశారు. ఈ దాడిలో డ్రైవర్‌తో సహా 9 మంది జవాన్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి భద్రతా బలగాల బృందం చేరుకుంది. నక్సలైట్లు రోడ్డుపై ఐఈడీని అమర్చినట్లు సమాచారం.

ఈ దాడిలో తొమ్మిది మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌ను అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ.. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలోని కుత్రు ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత సైనికులు నారాయణపూర్ నుండి తిరిగి వస్తున్నారు.

బీజాపూర్ జిల్లాలోని కుట్రు-బెద్రే రహదారిపై అమేలి సమీపంలో ఈ దాడి జరిగింది. ఆదివారం నారాయణపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత సైనికులు తిరిగి వస్తున్నారు. నాలుగు రోజులు అడవిలో నడిచి అలసిపోయారు సైనికులు. దాంతో పికప్ వాహనం ఎక్కారు.

పేలుడు జరిగిన సమయంలో వాహనంలో దాదాపు 20 మంది సైనికులు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఘటనా స్థలానికి బయలుదేరారు. గాయపడిన సైనికులను అక్కడి నుంచి రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

Next Story