యోగి ఆదిత్యనాథ్ సభలో రివాల్వర్ కలకలం
Major lapse in CM Yogi's security. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమావేశానికి ముందు ఓ వ్యక్తి గన్నుతో రావడంతో
By Medi Samrat Published on 22 Oct 2021 8:32 PM ISTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమావేశానికి ముందు ఓ వ్యక్తి గన్నుతో రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు పలువురు అధికారులపై వేటు వేశారు. బస్తీ జిల్లాలో గురువారం జరిగిన సీఎం పర్యటన జరిగింది. బహిరంగ సభ ఆడిటోరియానికి సీఎం యోగి రావడానికి 45 నిమిషాల ముందు లైసెన్సు పొందిన రివాల్వరుతో ఓ వ్యక్తి రావడాన్ని సర్కిల్ ఆఫీసర్ గుర్తించినట్లు బస్తీ జిల్లా ఎస్పీ ఆశిష్ శ్రీవాస్తవ వెల్లడించారు. రివాల్వరుతో సీఎం సభ జరిగే ఆడిటోరియానికి వచ్చిన వ్యక్తిని సర్కిల్ ఆఫీసర్ బయటకు తీసుకువెళ్లి విచారించారు.
ఆ వ్యక్తిరివాల్వర్ తీసుకెళ్లడంతో నిర్లక్ష్యం వహించినందుకు 7 మంది పోలీసులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ హాజరు కావడానికి 40 నిమిషాల ముందు నిందితుడు తన రివాల్వర్‌తో వచ్చాడు. అతను ఆడిటోరియంలోకి ప్రవేశించిన వెంటనే, అతడిని పోలీసులు బయటకు పంపించివేశారు. నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.. మరో ముగ్గురు పోలీసులపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఒక వ్యక్తి తన లైసెన్స్ పొందిన రివాల్వర్‌తో ఆడిటోరియానికి వచ్చాడు. అక్కడ విధుల్లో ఉన్న సర్కిల్ ఆఫీసర్ అతడిని చూసి వెంటనే ఆడిటోరియం నుండి బయటకు తీసుకువెళ్లారు. ప్రాథమిక విచారణలో బస్తీ జిల్లాలో 4 మంది పోలీసులతో సహా 7 మంది పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలిందని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు. బస్తీ జిల్లాలో నియమించబడిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.. మిగిలిన ముగ్గురు పోలీసులకు సంబంధించి సంబంధిత ఎస్పీలకు నివేదికలు పంపబడ్డాయని అధికారులు తెలిపారు.