నవంబర్‌ 1 నుంచి జరిగే మార్పులివే.. గ్యాస్‌ ధరలు, వాట్సాప్‌ బంద్‌తో పాటు..

Major Changes From November 1st. సామాన్య ఉద్యోగి ప్రతి నెల 1వ తేదీ ఎప్పుడెప్పుడూ వస్తుందా అంటూ ఆశతో ఎదురుచూస్తాడు. ఎందుకంటే నెలంతా చేసిన కష్టానికి

By అంజి  Published on  30 Oct 2021 6:39 PM IST
నవంబర్‌ 1 నుంచి జరిగే మార్పులివే.. గ్యాస్‌ ధరలు, వాట్సాప్‌ బంద్‌తో పాటు..

సామాన్య ఉద్యోగి ప్రతి నెల 1వ తేదీ ఎప్పుడెప్పుడూ వస్తుందా అంటూ ఆశతో ఎదురుచూస్తాడు. ఎందుకంటే నెలంతా చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కేది ప్రధానంగా ఆరోజే కాబట్టి. జీతం వస్తుంది.. ఖర్చైపోతాయి.. మళ్లీ యథావిధిగా ఉద్యోగ పనిలో నిమగ్నమైపోతాడు. ప్రతి నెల 1వ తేదీన పలు మార్పులు జరుగుతుంటాయి. సామాన్యుడికి ఇవి కొన్ని సార్లు ఊరట కలిగిస్తాయి.. మరికొన్ని సార్లు ఇబ్బందులు పెడుతాయి. అలానే నవంబర్‌ 1వ తేదీన పలు మార్పులు జరగనున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెన్షనర్లకు ఊరట కలిగించే విషయం చెప్పింది. ఇకపై లైఫ్ సర్టిఫికెట్‌ను పెన్షనర్లు బ్యాంకుకు వచ్చి ఇవ్వాల్సిన పని లేకుండా.. నేరుగా వీడియో కాల్‌ చేసే సదుపాయం కల్పిస్తోంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ ఈ సేవలను ప్రారంభించనుంది.

రోజు పెరుగుతున్న ఇంధన ధరలతో పాటు సిలిండర్‌ గ్యాస్‌ ధరలు కూడా సామాన్యుడి నడ్డీ విరుస్తున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎల్పీజీ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సవరిస్తుంటాయి. నవంబర్‌ 1వ తేదీన మరోసారి గ్యాస్‌ ధరను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 100 రూపాయలు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిలిండర్‌ ధరలు పెంచేందుకు ఎల్పీజీ కంపెనీలు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.

నవంబర్‌ 1వ తేదీ నుంచి పాలు పాత ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్‌ 4.0.3, ఐఓఎస్‌ 9, కాయ్‌ 2.5.1 వెర్షన్‌ ఓఎస్‌లతో పాటు వాటి ముందు తరం ఫోన్లలో వాట్సాల్‌ బంద్‌ కానున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్‌ ఇప్పటికే తెలిపింది.

ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆప్‌ బరోడా నవంబర్‌ 1 నుంచి ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. నెలలో 3 కంటే ఎక్కువ సార్లు డబ్బులు డిపాజిట్‌ చేస్తే రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. నెలలో మూడు సార్లు ఏటీఎం నుంచి కాకుండా డబ్బులు విత్‌ డ్రా చేస్తే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది జన్‌ధన్‌ అకౌంట్లకు వర్తించదు.

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది మంచి గుడ్‌న్యూస్‌. ఎందుకంటే నవంబర్‌ నెలలో పలు కంపెనీలు ఐపీవోలోకి వస్తున్నాయి. నవంబర్‌ 1వ తేదీన పాలసీ బజార్‌ ఐపీవో ప్రారంభం కానుంది. నవంబర్‌ 8 నుంచి పేటీఎం ఐపీవోలోకి రానుంది. నైఆ, ఎస్‌జేఎస్‌, సిగాచీ ఇండస్ట్రీస్‌ వంటివి ఐపీవోలోకి వస్తాయి.

Next Story