పార్లమెంట్ లో అభ్యంతరకరమైన పదాన్ని ఉపయోగించినందుకు తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపి మహువా మోయిత్రా విమర్శలను ఎదుర్కొన్నారు. మంగళవారం బడ్జెట్ సెషన్‌లో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతున్న సమయంలో మెహువా లేచి నిలబడి బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. ఆమె మాత్రం క్షమాపణలు చెప్పనని అంటున్నారు. ఆమెపై వస్తున్న విమర్శలపై బుధవారం ఆమె స్పందిస్తూ ‘‘పార్లమెంట్ విలువలు, సంప్రదాయాల గురించి బీజేపీ లెక్చర్లు ఇస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీ నుంచి ఎన్నికైన ఆ వ్యక్తి నన్ను మధ్యలో అడ్డుకోవాలని ప్రయత్నించారు. నేను యాపిల్‌ను యాపిల్ అనే అంటాను. కానీ ఆరెంజ్ అని అనను. వాళ్లు నన్ను ప్రివిలేజెస్ కమిటీకి తీసుకెళితే, నా వైపు ఉన్న నిజాన్ని నేను చెప్తాను’’ అని అన్నారు.