మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లోని ఒక వధువు కుటుంబం.. వరుడి సిబిల్ స్కోర్(క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్) తక్కువగా ఉన్న కారణంగా పెళ్లి రద్ధు చేసుకుంది. సిబిల్ స్కోర్ దారుణంగా ఉండడంతో ఆర్థిక విశ్వసనీయత లేని అబ్బాయికి అమ్మాయిని ఇవ్వడం కరెక్ట్ కాదని భావించి వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
అమ్మాయికి అబ్బాయి నచ్చడం.. అబ్బాయికి అమ్మాయి నచ్చడంతో ఇరు కుటుంబాలు సంతృప్తి చెందాయి. ఇక వివాహానికి సంబంధించిన డేట్స్ కూడా దాదాపుగా ఖరారయ్యాయి. కానీ ఒప్పందం కుదుర్చుకునే ముందు.. వధువు కుటుంబ సభ్యుల నుండి ఊహించని డిమాండ్ వచ్చింది. వరుడి CIBIL స్కోర్‌ను తనిఖీ చేయాలనుకున్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. వరుడు పలుమార్లు అప్పులు తీసుకున్నాడని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడని సిబిల్ రిపోర్ట్ వెల్లడించింది. తమ కుమార్తె భవిష్యత్తుపై ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేశారు.