బలాన్ని నిరూపించుకున్న షిండే

Maharashtra Chief Minister Eknath Shinde Wins Trust Vote. మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు.

By Medi Samrat  Published on  4 July 2022 12:40 PM IST
బలాన్ని నిరూపించుకున్న షిండే

మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని కాపాడుకున్నారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు. షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది.

ఈ ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో షిండే విజయం సాధించారు. శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిస్తూ.. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.









Next Story