మహాకుంభ్, మృత్యు కుంభ్‌గా మారింది..యోగి సర్కార్‌పై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ

మహాకుంభ్ మేళా మృత్యు కుంభ్‌గా మారిందని యోగి సర్కార్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.

By Knakam Karthik
Published on : 18 Feb 2025 5:12 PM IST

National News, MahaKumbh Mela, Mamata Banerjee, Uttapradesh, Prayagraj, Bjp, Tmc, Modi

మహాకుంభ్, మృత్యు కుంభ్‌గా మారింది..యోగి సర్కార్‌పై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ

మహాకుంభ్ మేళా మృత్యు కుంభ్‌గా మారిందని యోగి సర్కార్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహా కుంభ మేళాకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని సీఎం మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేశారు. ఈ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ నిర్వహణపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట మరణాలను 'మృత్యు కుంభ్' అని పేర్కొన్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు సరైన ప్రణాళిక లేకపోవడంతో, దేశాన్ని విభజించడానికి మతాన్ని అమ్మేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పవిత్ర గంగా మాత, మహాకుంభ్‌ను గౌరవిస్తా.. కానీ అక్కడ ప్లానింగ్ లేదు.. ఇప్పటివరకు ఎందరు కోలుకున్నారు? సంపన్నులు, వీఐపీలకు వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. పేదల కోసం ఏమీ చేయలేదు. మేళాలో తొక్కిసలాట పరిస్థితులు సహజమే కానీ సరైన ఏర్పాట్లు ఇంకా ముఖ్యం అని.. సీఎం మమతా బెనర్జీ అన్నారు. సంఘటన తర్వాత మహాకుంభ మేళాకు ఎన్ని కమిషన్లు పంపించారు అని ప్రశ్నించారు. కుంభ్ నుంచి మృతదేహాలను పోస్ట్‌మార్టం చేయకుండా బెంగాల్‌కు పంపించారని ఆమె ఆరోపించారు. వారు గుండెపోటుతో మరణించారని చెబుతారు, వారికి పరిహారం నిరాకరిస్తారు.. అని మమతా ఆరోపించారు.

కాగా జనవరి 29న జరిగిన మహా కుంభమేళాలో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరిగిన గందరగోళం, రద్దీ మధ్య కనీసం 30 మంది మరణించారు. పవిత్ర స్నానాలు చేయడానికి లక్షలాది మంది గుమిగూడారు. దీనికి సంబంధించిన మరో సంఘటనలో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభమేళా కోసం రైలు ఎక్కడానికి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు .

Next Story