దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ తో పాటు ఉత్తర భారత్ లోని పలు ప్రాంతాల్లో 2023 జూన్ 13న మంగళవారం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 1:30 తర్వాత సంభవించిన భూకంపం 10 సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్‌లో కూడా ప్రకంపనలు వచ్చాయి. 10 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో రిక్డర్డ్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.0గా నమోదు కాగా, జమ్మూ కశ్మీర్ లో 5.7 గా నమోదైంది. భూకంపం ధాటికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.
జమ్మూ కశ్మీర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 5.7 గా గుర్తించారు. కిస్త్వాడ్ కు ఈశాన్య దిశగా 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు ఈఎంఎస్ సీ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్ లో తీవ్ర ప్రకంపనలు రాగా దీని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని పలు పాంత్రాల్లో భూమి కంపించింది.