ఊపిరి పీల్చుకున్న కార్తీ చిదంబరం

Madras High Court Ends Income Tax Proceedings Against Karti Chidambaram. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు

By Medi Samrat  Published on  12 Dec 2020 1:37 PM GMT
ఊపిరి పీల్చుకున్న కార్తీ చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు మద్రాస్ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపుకు సంబంధించి కార్తీ చిదంబరం, ఆయన భార్యపై ప్రారంభించిన ప్రొసీడింగ్స్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆస్తి అమ్మకానికి సంబంధించి రూ. 7 కోట్లకు లెక్కలు చెప్పలేదంటూ ఐటీ శాఖ వీరిపై కేసు నమోదు చేసింది. హైకోర్టు స్పందిస్తూ, ఇప్పటికిప్పుడే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని.. సరైన సమీక్ష తర్వాత అవసరమనుకుంటే ప్రొసీడింగ్స్ ను మళ్లీ ప్రారంభించవచ్చని తెలిపింది.

2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో కార్తీ దంపతులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ముత్తుకాడులో ఉన్న తమ సొంత స్థలాన్ని అమ్మడం ద్వారా కార్తీ చిదంబరం, ఆయన భార్య రూ. 6.38 కోట్లు వచ్చాయి. ఇందులో రూ. 1.35 కోట్లు నగదు రూపంలో వచ్చిందని.. దీనికి సంబంధించి వారు పన్ను చెల్లించడం కానీ, లేదా అసెస్ మెంట్ లో పేర్కొనడం కానీ చేయలేదని కేసు నమోదు చేశారు. ఇప్పటికిప్పుడే దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, సమీక్ష తర్వాత అవసరమనుకుంటే ప్రొసీడింగ్స్ ను మళ్లీ ప్రారంభించవచ్చని మద్రాస్ హైకోర్టు చెప్పడంతో కార్తీ చిదంబరం కుటుంబానికి కాస్త ఊరట కలిగింది.


Next Story