ప్రధాని మోదీ రోడ్ షోకు ఎట్టకేలకు అనుమతి వచ్చేసింది

మార్చి 18న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది.

By Medi Samrat  Published on  15 March 2024 8:00 PM IST
ప్రధాని మోదీ రోడ్ షోకు ఎట్టకేలకు అనుమతి వచ్చేసింది

మార్చి 18న తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. భద్రతాపరమైన ప్రమాదాలతో సహా పలు కారణాలను చూపుతూ కోయంబత్తూర్‌ జిల్లా పోలీసు యంత్రాంగం రోడ్‌షోకు అనుమతి నిరాకరించిందని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని షరతులు విధించి రోడ్‌షోకు అనుమతి ఇవ్వాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రచారంలో భాగంగా ఈ రోడ్‌షో నిర్వహించనున్నారు. పారిశ్రామిక-టెక్స్‌టైల్ సిటీలో 3.6 కిలోమీటర్ల రోడ్‌షోకు బీజేపీ అనుమతి కోరింది.

మొదట కోయంబత్తూరులో మార్చి 18న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షోకు తమిళనాడు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు వివరించారు. కోయంబత్తూరు పట్టణంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించేందుకు బీజేపీ పోలీసులను అనుమతి కోరింది. 1998లో బాంబు పేలుడు జరిగిన ఆర్‌ఎస్ పురంలో రోడ్‌షోను ముగించాలని నిర్ణయించారు. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాక‌రించారు. అయితే దీనిపై బీజేపీనా కోర్టును ఆశ్రయించగా.. ఎట్టకేలకు అనుమతి లభించింది.

Next Story