మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండటానికి ఒక టీనేజ్ అమ్మాయి చెట్టు ఎక్కింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఒక 18 ఏళ్ల అమ్మాయి చెట్టుపైన కనిపించింది.. ఒక ఆరోగ్య సంరక్షణ కార్యకర్త సిరంజితో ఆమె వైపు వెళ్తోంది. హెల్త్‌కేర్ వర్కర్ మాటలు, అక్కడే ఉన్న కొందరు చెప్పిన మాటలు విని ఎట్టకేలకు ఆ యువతి చెట్టు కిందకు దిగింది. ఛత్తర్‌పూర్ జిల్లాలోని మంకారి గ్రామంలో టీకాల బృందం పర్యటించింది.
ఆ అమ్మాయి తన ఇంటి నుంచి పారిపోయి చెట్టు ఎక్కి ఇంజెక్షన్ వేయించుకోకుండా దాక్కున్నట్లు సమాచారం అందింది. డాక్టర్ ఆమెను వెంబడించడం, చెట్టు కింద నిలబడి, ఇతర గ్రామస్తులు ఆమెను మందలించడం వీడియోలో చూడవచ్చు. దీంతో ఆమె ఎట్టకేలకు చెట్టు కిందకు దిగింది. ఆమెకు వ్యాక్సిన్ డోస్ ను వేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్లు వేసుకోకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వ్యాక్సిన్ మీద ఉన్న అపోహల కారణంగా ఇలాంటి పనులు చేస్తూ వస్తున్నారు.