వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి.. హెలికాప్టర్‌తో రక్షించిన సిబ్బంది

Madhya Pradesh Minister Airlifted After Trying Flood Rescue On Boat.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2021 7:22 AM GMT
వరదల్లో చిక్కుకున్న హోం మంత్రి.. హెలికాప్టర్‌తో రక్షించిన సిబ్బంది

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి. వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌డానికి వెళ్లిన ఓ మంత్రి కూడా వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నారు. ఈ ఘ‌ట‌న దాటియా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వ‌ర‌ద నీటి కార‌ణంగా దాతియా జిల్లాలోని అనేక గ్రామాలు నీటి ముంపున‌కు గుర‌య్యాయి. వ‌ర‌దల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసేందుకు ఈ జిల్లా ఎమ్మెల్యే, హోం మంత్రి నరోత్తం మిశ్రా త‌న సిబ్బందితో క‌లిసి వెళ్లారు.

ఈ క్రమంలో వీరు ప్ర‌యానిస్తున్న‌ప‌డ‌వ మీద చెట్టు విరిగిప‌డింది. దీంతో ప‌డ‌వ దెబ్బ‌తింది. ఆ త‌రువాత ప‌డ‌వ ఇంజిన్ కూడా స్టార్ట్ కాలేదు. అప్పటికే ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో ఆ ఇంటివారంతా ఇంటి పైకప్పు మీదకు ఎక్కి బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. అతి కష్టం మీద మంత్రి నరోత్తం మిశ్రా బోటులో ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. చుట్టూ వరద నీరు ఎగసిపడుతోంది. వెంట‌నే ఆయ‌న అధ‌కారుల‌కు స‌మాచారం ఇచ్చారు. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. భార‌త వైమానికి ద‌ళానికి చెందిన హెలికాప్ట‌ర్ లో అక్క‌డికి వెళ్లారు. అందులోని సిబ్బంది హెలికాఫ్టర్ నుంచి తాడును కిందికి వదలడంతో దాన్ని పట్టుకుని ఆయన పైకి చేరగలిగారు. ఇతర సహాయక సిబ్బందిని, బాధితులను కూడా ఇలాగే సిబ్బంది రక్షించారు.

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు మరియు సహాయక శిబిరాలను పర్యవేక్షించడానికి మంత్రి నరోత్తమ్ దాటియా జిల్లాలోని అనేక వరద ప్రభావిత గ్రామాలను సందర్శించారు. వరదల కారణంగా దాటియా జిల్లాలోని రెండు వంతెనలు కూలిపోయాయి. అంతేకాకుండా.. మూడో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీద పగుళ్లు ఏర్పడ్డాయి. దాంతో ఆ వంతెనను ముందుజాగ్రత్తగా మూసివేశారు. కాగా.. మంత్రి నరోత్తం మిశ్రా చర్యను కాంగ్రెస్ పార్టీ ఓ స్టంట్ గా అభివర్ణించింది. స్పైడర్ మ్యాన్‌లాగా షో చేయడానికి మా హోంమంత్రి ప్రయత్నించిన విధానం ఆయనకు మరియు ఆయనతో పాటు ఉన్న సిబ్బందికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఆయన ఊహించి ఉండరు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Next Story
Share it