అదృష్టం అంటే వీళ్ల‌దే.. రాత్రికి రాత్రే ల‌క్షాధికారుల‌య్యారు

Madhya Pradesh Farmers Found Diamond in Panna District.అదృష్టం ఎవ‌రి త‌లుపు ఎప్పుడు త‌డుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Sept 2022 10:16 AM IST
అదృష్టం అంటే వీళ్ల‌దే.. రాత్రికి రాత్రే ల‌క్షాధికారుల‌య్యారు

అదృష్టం ఎవ‌రి త‌లుపు ఎప్పుడు త‌డుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. ద‌శ తిరిగితే రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులుగా మారిపోవ‌చ్చు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ప‌న్నా జిల్లాకు చెందిన కొంద‌రు వ్య‌క్తులు రాత్రికి రాత్రే ల‌క్షాధికారులుగా మారిపోయారు.

బ్రిజ్‌పురలో రాజేంద్ర గుప్త త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇత‌ను రైతు. కొంత‌కాలం క్రితం మ‌రో ఆరుగురు స్నేహితుల‌తో క‌లిసి ల‌ల్కీ ధేరీ ప్రాంతంలో ఒక చిన్న వ‌జ్రాల గ‌నిని లీజుకు తీసుకున్నాడు. వ‌జ్రాల కోసం వేట ప్రారంభించారు. నెల‌రోజుల పాటు రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా వ‌జ్రాల కోసం వెతుక‌గా ఎలాంటి ఫ‌లితం క‌నిపించ‌లేదు. అయితే గురువారం వారి పంట పండింది. 3.21 క్యారెట్ల వ‌జ్రం వారికి దొరికింది.

దీంతో వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. వెంట‌నే వారు దాన్ని వ‌జ్రాల కార్యాల‌యానికి తీసుకువెళ్లి అక్క‌డి అధికారుల‌కు చూపించారు. దీని విలువ భారీ మొత్తంలో ఉండొచ్చున‌ని అంచనా వేస్తున్నారు. దీంతో వారి ఆనందం రెట్టింపైంది. ఆ వ‌జ్రాన్ని వేలం వేయ‌డం ద్వారా వ‌చ్చిన న‌గ‌దును స‌మానంగా పంచుకుని ఏదైన వ్యాపారం చేస్తామ‌ని వారు తెలిపారు.

Next Story