కాళి అమ్మవారి ఆశీస్సులు భారత్ కు ఎల్లప్పుడూ ఉంటాయి

Maa Kaali's blessings are with India. ‘కాళి’ పోస్టర్ వివాదం దేశంలో ప్రస్తుతం వివాదానికి కారణమైంది. హిందువుల మనోభావాలను

By Medi Samrat  Published on  10 July 2022 3:30 PM IST
కాళి అమ్మవారి ఆశీస్సులు భారత్ కు ఎల్లప్పుడూ ఉంటాయి

'కాళి' పోస్టర్ వివాదం దేశంలో ప్రస్తుతం వివాదానికి కారణమైంది. హిందువుల మనోభావాలను నిర్మాత, దర్శకురాలు లీనా మణిమేఖలై కావాలనే దెబ్బతీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి కాళికామాత ప్రస్తావన వచ్చింది. కాళికా అమ్మవారి ఆశీస్సులు భారత్ కు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పుకొచ్చారు. స్వామి ఆత్మస్థానంద శతాబ్ది వేడుకలను ఉద్దేశించి ప్రధాని ఆదివారం ప్రసగించారు. రామకృష్ణ మఠం 15వ అధ్యక్షుడిగా స్వామి ఆత్మస్థానంద పనిచేశారు.

స్వామి రామకృష్ణ పరమహంస ఓ సన్యాసి. స్వయంగా తన కళ్ల ముందు కాళికా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారు. వివేకానందకు ఎంతో గుర్తింపు ఉన్నా, కాళి అమ్మవారి పట్ల భక్తి భావంతో చిన్న పిల్లాడిలా మారిపోయారు. అంతటి అచంచల విశ్వాసమే స్వామి ఆత్మస్థానందలోనూ ఉందని ప్రధాని మోదీ అన్నారు. బెంగాలీ ప్రజలు కాళికామాతను ఆరాధించడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. బీజేపీ నేత అమిత్ మాలవీయ కూడా ఈ అంశంపై స్పందించారు. ''కాళి మాత భక్తి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. కేవలం బెంగాల్ ప్రజల కోసమే కాదు, మొత్తం భారతావని తరఫున మాట్లాడారు. కానీ, టీఎంసీ ఎంపీ (మొయిత్రా) కాళికామాతను అగౌరవ పరుస్తోంది. మమతా బెనర్జీ ఆమెపై చర్యలు తీసుకోవడానికి బదులు, సమర్థిస్తున్నారు''అని మాలవీయ ట్వీట్ చేశారు.



Next Story