పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

గాల్వాన్‌లో భారత సైనికులు, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు.

By Medi Samrat
Published on : 15 July 2025 3:52 PM IST

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్

గాల్వాన్‌లో భారత సైనికులు, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు. రాహుల్ గాంధీతో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సీనియ‌ర్‌ నాయకులు, వందలాది మంది మద్దతుదారులు కూడా ఆయన వెంట విమానాశ్రయం నుంచి కోర్టు కాంప్లెక్స్ వరకు వచ్చారు. కాగా, ఈ కేసులో రాహుల్ గాంధీకి లక్నోలోని ఎంపీ-ఎమ్మెల్యే స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌, రాజ్యసభ సభ్యుడు ప్రమోద్‌ తివారీ, మాజీ మంత్రి నస్రుద్దీన్‌ సిద్ధిఖీ, ఎంపీ తనూజ్‌ పునియాతో పాటు రాష్ట్ర నేతలంతా రాహుల్‌ వెంట ఉన్నారు. క్యాంపస్‌లోకి వాహనాల ప్రవేశంపై సీనియర్ నేతలు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాహుల్ కాన్వాయ్ లోపలికి వెళ్లిన తర్వాత ఇతర నేతలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

డిసెంబర్ 16, 2022న రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సందర్భంగా వివిధ మీడియా సిబ్బంది మరియు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో భారత సైన్యం, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రస్తావించారని, రాహుల్ గాంధీపై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రిటైర్డ్ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

తన ప్రసంగంలో, "భారత్ జోడో యాత్ర గురించి ప్రజలు చాలా విషయాలు అడుగుతారు, కానీ చైనా సైనికులు మన సైనికులను కొట్టడం గురించి ఒక్కసారి కూడా అడగరు" అని ఆయన అన్నారు.

ఈ విషయంపై భారత సైన్యం డిసెంబర్ 12న చైనా సైన్యం భారత సరిహద్దును ఆక్రమించుకుందని అధికారిక ప్రకటన విడుదల చేసింది, దానికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత చైనా సైన్యం తన భూభాగంలోకి తిరిగి వెళ్లిపోయింది. రాహుల్ గాంధీ చేసిన ఈ తప్పుడు ప్రకటన వల్ల తాను, ఇతర భారతీయ సైనికుల మ‌నోభావాలు గాయపడ్డాయ‌ని ఆయన ఆరోపించారు.

Next Story