ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదు : నెదుమారన్ సంచలనం
LTTE's Prabakaran is alive, will appear in public soon. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోలేదని.. ఇంకా బతికే ఉన్నాడనే వార్త కొందరికి ఆనందాన్ని ఇస్తుండగా.
By M.S.R Published on 13 Feb 2023 9:00 PM ISTప్రస్తుతం అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం, రాజపక్స ప్రభుత్వం అధికారంలో కోల్పోవడం వంటివి ప్రభాకరన్ బయటికొచ్చేలా చేస్తున్నాయని నెదుమారన్ అన్నారు. ప్రభాకరన్ చనిపోయాడని జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైందని సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభాకరన్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేస్తారు. తమిళుల కోసం తను చేయబోయే పోరాటానికి సంబంధించిన ప్లాన్ ప్రకటిస్తారని అన్నారు. పార్టీలకు అతీతంగా తమిళనాడులో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, తమిళులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు ప్రభాకరన్‌కి అండగా నిలవాలని నెదుమారన్ కోరారు.
ప్రభాకరన్ చనిపోయారంటూ 2009 మే 18న శ్రీలంక ఆర్మీ ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. ప్రభాకరన్ కుమారుడు కూడా చనిపోయాడని తెలిపింది. ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్ చనిపోయారని అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడంటూ ఎవరూ చెప్పలేదు.. ఇప్పుడు ఒక్కసారిగా నెదుమారన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.