అందరూ అనుకున్నట్లుగానే సిలిండర్ ధరను దేశీయ చమురు కంపెనీలు పెంచాయి. అయితే కమర్షియల్ సిలిండర్ ధరను పెంచిన చమురు కంపెనీలు.. ఎల్‌పీజీ సిలిండర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.266 కు పెంచాయి. ఇవి నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెంచిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2000 దాటింది. అంతకు ముందు కమర్షియల్ సిలిండర్ ధర రూ.1735 గా ఉండేది. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ముంబైలో రూ.1950, చెన్నైలో రూ.2133, కోల్‌కతాలో రూ.2073కు చేరుకుంది.
కమర్షియల్ సిలిండర్ ధరలు పెంపుతో దుకాణాదారులు ఆందోళనకు గురువుతున్నారు. కమర్షియల్ సిలిండర్లను ఎక్కుగా హోటల్స్, రెస్టారెంట్లలో వాడుతుంటారు. ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.899.50గా ఉంది. లాస్ట్ టైమ్ అక్టోబర్ 6వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో.. ఎల్‌పీజీ సిలిండర్ భారీగా పెరుగుతాయని దేశ వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది.