సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. వెంటనే ఆధార్‌ లింక్‌ చేయండి.!

LPG Gas cylinder subsidy to cost you rs 300 less. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు విపరీతంగా పెరిగి, ఇప్పుడు కొన్ని చోట్ల దాదాపు రూ. 1000 మార్కును తాకడంతో, సిలిండర్‌పై రూ. 300 వరకు ఆదా

By అంజి
Published on : 24 Nov 2021 11:24 AM IST

సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. వెంటనే ఆధార్‌ లింక్‌ చేయండి.!

ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు విపరీతంగా పెరిగి, ఇప్పుడు కొన్ని చోట్ల దాదాపు రూ. 1000 మార్కును తాకడంతో, సిలిండర్‌పై రూ. 300 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రయోజనం పొందాలనుకునే వినియోగదారులు LPG సిలిండర్లలో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 300 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అనేక కుటుంబాలకు భారీ ఉపశమనం కలిగించింది. కొంతకాలం క్రితం వరకు, డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌కు రూ. 594కి లభించేది, ఇప్పుడు రూ. 834 నుండి దాదాపు రూ. 1000 వరకు పెరిగింది.

ఎల్‌పిజి సిలిండర్‌లపై సబ్సిడీ ప్రయోజనాన్ని పొందుతున్న కస్టమర్లు తక్షణ లబ్ధిదారులు అవుతారు. ప్రయోజనాలను పొందేందుకు, వారు తమ సబ్సిడీ ఖాతాని వారి ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని నిర్ణయించింది. సబ్సిడీలను పొందుతున్న వినియోగదారులకు ఇప్పుడు సిలిండర్‌పై మరిన్ని తగ్గింపుల ప్రయోజనం లభిస్తుంది. గతంలో సిలిండర్ల కొనుగోలుపై వచ్చే సబ్సిడీని రూ.20 నుంచి రూ.30కి తగ్గించగా ఇప్పుడు మళ్లీ దాదాపు రూ.300కి పెంచారు.

ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్లు తీసుకునే వారికి ఈ సబ్సిడీ పథకం ద్వారా గరిష్ట ప్రయోజనం లభిస్తుంది. . గతంలో రూ.174.86 సబ్సిడీ పొందుతుండగా ఇప్పుడు రూ.312.48కి పెంచారు. గతంలో రూ.153.86 సబ్సిడీని పొందిన ఇతరులకు ఇప్పుడు రూ.291.48 వరకు సబ్సిడీ లభిస్తుంది. భారత్ గ్యాస్ కంపెనీ యొక్క వినియోగదారులు వారి అధికారిక వెబ్‌సైట్ - ebharatgas.com ను సందర్శించవచ్చు. ndane LPG గ్యాస్ సిలిండర్ కస్టమర్ల కోసం, మొత్తం సమాచారాన్ని పొందడానికి - cx.indianoil.inని సందర్శించండి. సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా మీరు మీ ఆధార్ కార్డును సబ్సిడీ బ్యాంక్ ఖాతాతో నేరుగా లింక్ చేయవచ్చు.

Next Story