కోటాలో సూసైడ్స్‌కు లవ్ అఫైర్సే కారణం.. రాజస్థాన్ మంత్రి వివాదాస్పద కామెంట్స్

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల సూసైడ్స్‌కు లవ్ అఫైర్స్ కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

By Knakam Karthik
Published on : 19 Jan 2025 8:06 AM IST

National news, rajasthan, kota, minister madan dilwar

కోటాలో సూసైడ్స్‌కు లవ్ అఫైర్సే కారణం.. రాజస్థాన్ మంత్రి వివాదాస్పద కామెంట్స్

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల సూసైడ్స్‌కు లవ్ అఫైర్స్ కారణమని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిల్వార్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ప్రేమ వ్యవహారాల కారణంగా కొంత మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ఆయన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ప్రవేశ, పోటీ పరీక్షల కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌లోని కోటాలో ప్రతి ఏడాది అధిక సంఖ్యలో విద్యార్థులు సూసైడ్స్ చేసుకోవడం ఆందోళనగా మారింది. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చదువు కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని ఆయన కోరారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి విద్యార్థికి కొన్ని రంగాలపై ఆసక్తి ఉంటుందని, దానికి వ్యతిరేకంగా వారి లక్ష్యాలను బలవంతం నిర్దేశించినప్పుడే వారు తీవ్ర ఒత్తిడికి గురవుతారని అన్నారు.



Next Story