నేడే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. దేశమంతా ఉత్కంఠ

యావత్తు దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వచ్చే ఐదేళ్ల పాటు మన దేశ పాలనను ప్రజలు ఎవరి చేతుల్లో పెట్టారో నేటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల రూపంలో తేలనుంది.

By అంజి  Published on  4 Jun 2024 6:25 AM IST
Lok Sabha election, election results, National news, BJP, Congress

నేడే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. దేశమంతా ఉత్కంఠ

యావత్తు దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వచ్చే ఐదేళ్ల పాటు మన దేశ పాలనను ప్రజలు ఎవరి చేతుల్లో పెట్టారో నేటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల రూపంలో తేలనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. 272 ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. అటు హ్యాట్రిక్‌ కొడతామని బీజేపీ, ఈ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ధీమాతో ఉన్నాయి.

హ్యాట్రిక్‌పై బీజేపీ ధీమా వెనుక ఐదు ప్రధాన అంశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోదీ ఇమేజ్‌ కీలక పాత్ర పోషించడం, కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌ అండ బీజేపీకి బలంగా మారడం, ఆర్థికంగా బలంగా ఉండటం, మహిళలు, యువత, రైతులు, పేదలే లక్ష్యంగా చేసిన ప్రచారం వంటరి అంశాలు బీజేపీ కలిసి వచ్చేవిగా కనిపిస్తున్ఆనయి. 2019 ఎన్నికల్లో ఓట్‌ షేర్‌ 45 శాతంకు పెరగడంతో ఈసారి కూడా ఆ ప్రభావం ఉండొచ్చని బీజేపీ ధీమాగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీదే మళ్లీ అధికారం అని అంచనా వేస్తున్నా ఇండియా కూటమి మాత్రం తాము 295 సీటలు సాధిస్తామని ధీమాగా ఉంది. అయితే కూటమికి అంతమొత్తంలో సీట్లు రావడం సవాల్‌తో కూడుకున్న విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలు, యూపీ, బెంగాల్‌, బిహార్‌, మహారాష్ట్ర, లక్షద్వీప్‌, అండమాన్‌, జమ్ముకశ్మీర్‌ నుంచి 295 స్థానాల్లో 176 గెలిచినా మిగతా రాష్ట్రాల్లో 119 సీట్లు గెలవాలని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వేళ కాంగ్రెస్‌ 2019 లెక్కలను మార్చగలిగితే ఇప్పుడు ఆశిస్తున్న టార్గెట్‌ను చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story