ఏప్రిల్ 16న ఏమి జరగబోతోంది అంటే..?

ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం స్పందించింది.

By Medi Samrat  Published on  23 Jan 2024 3:45 PM GMT
ఏప్రిల్ 16న ఏమి జరగబోతోంది అంటే..?

ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం స్పందించింది. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అనే వార్త నిజమేనా అని కొన్ని మీడియా సంస్థలు తమను అడిగాయని.. ఢిల్లీలోని సీఈవో కార్యాలయం తెలిపింది. ఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని, దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బంది ఎన్నికల పనులు పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువు తేదీ అని స్పష్టం చేసింది. ఏప్రిల్ 16 తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం వివరించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఈ నెల 19న అధికారిక లేఖను జారీ చేశామని వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని తెలిపారు.

ఏప్రిల్ 16న లోక్‌సభ ఎన్నికల తేదీ ఉండొచ్చన్న ఊహాగానాలకు దారితీసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం స్పందించాల్సి వచ్చింది. 2024 లోక్‌సభకు సాధారణ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, కార్యకలాపాలను పూర్తి చేయడం కోసమేనని క్లారిటీ ఇచ్చారు.

Next Story