ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా

భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ గందరగోళాన్ని ఎదుర్కొంది.

By -  Knakam Karthik
Published on : 6 Feb 2026 3:39 PM IST

National News, Delhi, Parliament Budget Sessions, Lok Sabha adjourned, opposition protests

ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ: భారత్-చైనా వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ గందరగోళాన్ని ఎదుర్కొంది. దీంతో వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ కార్యకలాపాలు శుక్రవారం రోజుకు వాయిదా పడ్డాయి. గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదని లోక్‌సభలోని సభ్యులు ప్రశ్నించారు. కొంతమంది సభ్యులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు,ప్లకార్డులు ప్రదర్శించారు. స్పీకర్ వీరిని శాంతపరచడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినిపించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.

ఈ బడ్జెట్ సెషన్‌లో ఇప్పటివరకు 19గంటల 13నిమిషాల సమయం వృథా అయింది. సభను సోమవారం ఉదయం 11గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్‌లో తొలివిడత బడ్జెట్ సమావేశాలు ఈనెల 13న ముగియనుండగా,రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9నుంచి లోక్‌సభలో బడ్జెట్ చర్చలు ప్రారంభమవుతాయి.

Next Story