పెరుగుతున్న కరోనా కేసులు.. లాక్‌డౌన్‌ దిశగా ఆలోచన..!

Lockdown in Maharashtra Govt's Review Meet in 2 Days. ముంబైలో ముంబైలో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరిస్తోంది, లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తోంది.

By Medi Samrat  Published on  10 March 2021 10:28 AM IST
lockdown in Maharashtra

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా పూర్తిగా తగ్గిందనుకునేలోపు మళ్లీ కేసుల సంఖ్య పెరుతుండటం మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇక మహారాష్ట్రలో మాత్రం పాజిటివ్‌ కేసుల సంఖ్య గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ముంబైలో కరోనా వైరస్‌ మళ్లీ విస్తరిస్తోంది. దీంతో కరోనా కట్టడికి ముంబై కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. గత కొన్ని రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ దిశగా ఆలోచిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే కేసులు పెరుగుతుండటంతో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ముంబైలో తక్షణమే లాక్‌డౌన్ విధించేది లేదని ముంబై గార్డియన్‌ మినిస్టర్‌ అస్లాం షేక్‌ ప్రకటించగా, మరికొన్ని రోజుల్లో కరోనా అదుపులోకి రాని పక్షంలో లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే కరోనా అదుపులోకి రాకుంటే తాత్కాలిక లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ముంబైలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని పుకార్లు వ్యాపించడంతో జనాలు నిత్యావసరాల కోసం కిరణా షాపుల ముందు బారులు తీరుతున్నారు.

కాగా, గత కొన్ని వారాలుగా ముంబై వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ అధికారుల్లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒక్క ముంబై విమానాశ్రయంలోనే గత ఏడాది సెప్టెంబర్ నెల నుంచి 2021 ఫిబ్రవరి నెలాఖరు వరకు 1408 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్టులో ఇప్పటి వరకు 2.20 లక్షల మంది కరోనా పరీక్షలు జరుపగా, గత నెల 6 నుంచి విమానాశ్రయం ప్రాంగణంలో ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో తిరిగి కరోనా వ్యాప్తి చెందడం పట్ల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు.

అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదన్న ముఖ్యమంత్రి.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆలోచనలో పడిపోయారు. అయితే కరోనా కట్టడిలోకి రాకపోతే పాక్షికంగా లాక్‌డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ఆంక్షలు విధిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించని వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. ప్రతి రోజు దాదాపు 8 వేలకుపైగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అప్పటికప్పుడు లాక్‌డౌన్‌ విధించకుండా కొంత సమయం తీసుకుని అప్పుడు కరోనా అదుపులోకి రాకపోతే పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.




Next Story