సైనికుడి కాళ్లకు నమస్కరించిన చిన్నారి.. వీడియో వైరల్‌

Little girl touches the feet of Army personnel. దేశాన్ని రక్షించే యోధులు దేవుడితో సమానం. దేశం కోసం, దేశ ప్రజల కోసం

By Medi Samrat  Published on  17 July 2022 3:03 PM IST
సైనికుడి కాళ్లకు నమస్కరించిన చిన్నారి.. వీడియో వైరల్‌

దేశాన్ని రక్షించే యోధులు దేవుడితో సమానం. దేశం కోసం, దేశ ప్రజల కోసం అహోరాత్రులు శ్రమించే వారు మన రక్షకులు. దేశసేవే జీవితంగా బతుకుతున్న సైనికులను చూస్తే గౌరవం కలుగుతుంది. కొంతమంది వారిని కలిసినప్పుడు కరచాలనం చేసి అభినందిస్తారు. అయితే ఇక్కడ ఓ చిన్నారి నిలబడి ఉన్న సైనికుల‌ వద్దకు వెళ్లి వారి పాదాలపై పడి నమస్కరించింది.

నల్లటి ఫ్రాక్‌లో ఒక అందమైన చిన్నారి బుల్లి బుల్లి అడుగుల‌తో సైనికుల వద్దకు పరుగెత్తింది. అక్కడ తోటి సైనికులతో మాట్లాడుతున్న ఓ సైనికుడు ఆ చిన్నారిని చూసి గడ్డం పట్టుకుని ప‌ల‌క‌రించాడు. వెంట‌నే సైనికుల ముఖాలను చూసిన‌ చిన్నారి.. ఓ సైనికుడి పాదాలకు నమస్కరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్షవర్ధన్ ముప్పవరపు ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకు నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.











Next Story