గుజరాత్‌లోని రాజులాలోని ఓ ప్రైవేట్ కంపెనీలోకి సింహం ప్రవేశించి అక్కడ పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసింది. అమ్రేలి జిల్లాలో ఉన్న కంపెనీ హాల్ ప్రాంగణంలో సింహం సంచరిస్తున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. అటవీశాఖ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో సింహం కోసం వెతకడం ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు సింహం జాడ దొరకలేదు.
ఎనిమిది సింహాలు అమ్రేలి జిల్లాలోని ఒక గ్రామంలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే ఇది జరిగింది. ఈ ప్రాంతంలో సింహం కనిపించడం సర్వసాధారణమని స్థానికులు తెలిపారు.