భారత్‌లో రెండేళ్లు తగ్గిన జీవితకాలం..!

Life expectancy in india dropped by two years. కరోనా ఎఫెక్ట్‌తో దేశ ప్రజల జీవితకాలం రెండేళ్లు తగ్గినట్లు ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌

By అంజి  Published on  23 Oct 2021 1:22 PM IST
భారత్‌లో రెండేళ్లు తగ్గిన జీవితకాలం..!

కరోనా ఎఫెక్ట్‌తో దేశ ప్రజల జీవితకాలం రెండేళ్లు తగ్గినట్లు ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్డడీస్‌ తెలిపింది. దేశ ప్రజల ఆయురార్దం సగటు రెండేళ్లు తగ్గినట్లు తన రిపోర్ట్‌లో ఆ సంస్థ వెల్లడించింది. కరోనా వైరస్‌ విజృంభణతో ఆడ, మగ వారిలో ఆయుష్షు తగ్గినట్లు ఐఐపీఎస్‌ ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ యాదవ్‌ తెలిపారు. బీఎంసీ పబ్లిక్‌ హెల్త్‌ జర్నల్‌లో దీనికి సంబంధించిన నివేదికను పబ్లిష్ చేశారు. కరోనా వైరస్‌ విజృంభించక ముందు దేశంలో పురుషుల జీవిత కాలం 69.2 ఏళ్లు కాగా, ఆడవారి జీవితకాలం 72 ఏళ్లుగా ఉంది. 2020లో కరోనా విజృంభణతో 35 నుంచి 79 ఏళ్ల వయస్సున్న వారిలో ఎక్కువ మరణాలు నమోదు అయ్యాయి. దీని కారణంగానే జీవితకాలం తగ్గినట్లు తెలుస్తోందని ప్రొఫెసర్‌ సూర్యకాంత్‌ యాదవ్‌ తెలిపారు.

దీంతో పురుషుల్లో 67.5 ఏళ్లు, మహిళల్లో 69.8 ఏళ్లకు జీవితకాలం చేరినట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 145 దేశాల గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్ డిసీజ్‌, కోవిడ్‌ ఇండియా అప్లికేషన్‌ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్‌ పోర్టల్‌ ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఐఐపీఎస్‌ తన నివేదికను తయారు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం మార్చి 2020 నుండి కరోనా కారణంగా 4.5 లక్షల మంది మరణించారు. ''కోవిడ్‌ ప్రభావం ఆయుర్దారాన్ని పెంచడానికి తాము గత దశాబ్ద కాలంగా సాధించిన పురోగతిని తుడిచిపెట్టేసిందని'' యాదవ్‌ అన్నారు. భారత్‌లో ఇప్పుడు జన్మించిన వారి ఆయుర్దాయం 2010లో ఉన్నట్లే ఉందన్నారు. ఐఐపిఎస్ డైరెక్టర్ డాక్టర్ కెఎస్ జేమ్స్ మాట్లాడుతూ... గతంలో అనేక అంటువ్యాధులు జనన గణాంకాల వద్ద ఆయుర్దాయంపై ప్రభావం చూపాయన్నారు.

Next Story