నిశ్చితార్థం చేసుకున్న లెస్బియన్ జంట.. త్వరలోనే గోవాలో పెళ్లి
Lesbian Couple Get Engaged With Commitment Rings In Nagpur. సామాజిక మూస పద్ధతులను బద్దలు కొట్టి, చాలా మంది లెస్బియన్ జంటలు ఇప్పుడు ముందుకు వచ్చి ప్రపంచం ముందు తమ సంబంధాలను
By అంజి Published on 8 Jan 2022 8:43 AM GMTసామాజిక మూస పద్ధతులను బద్దలు కొట్టి, చాలా మంది లెస్బియన్ జంటలు ఇప్పుడు ముందుకు వచ్చి ప్రపంచం ముందు తమ సంబంధాలను అంగీకరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్న తర్వాత, ఇద్దరు మహిళలు గత వారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 'కమిట్‌మెంట్ రింగ్ వేడుక'లో నిశ్చితార్థం చేసుకున్నారు. తమ జీవితాలను జంటగా కలిసి గడపాలని ప్రమాణం చేశారు. లెస్బియన్ జంట తమ రిలేషన్‌షిప్ గురించి కూడా పంచుకున్నారు.
ఈ లెస్బియన్ జంట వృత్తిరీత్యా వైద్యులు. గోవాలో పెళ్లికి ప్లాన్ చేస్తున్నారు. "మేము ఈ సంబంధాన్ని 'జీవితకాల నిబద్ధత' అని పిలుస్తాము. మేము గోవాలో మా పెళ్లిని ప్లాన్ చేస్తున్నాము"అని మహిళల్లో ఒకరైన పరోమితా ముఖర్జీ చెప్పారు. "2013 నుండి మా రిలేషన్‌షిప్ గురించి మా నాన్నకు తెలుసు. ఇటీవల నేను మా అమ్మకు చెప్పినప్పుడు, ఆమె ఆశ్చర్యపోయింది. కానీ నేను సంతోషంగా ఉండాలని ఆమె కోరుకున్నందున ఆమె తరువాత అంగీకరించింది. అని పరోమితా చెప్పారు.
అదేవిధంగా, సురభి మిత్రా కూడా తన కుటుంబం నుండి తన రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కోలేదని చెప్పింది. "నా రిలేషన్‌షిప్‌కు నా కుటుంబం నుండి ఎప్పుడూ వ్యతిరేకత లేదు. నిజానికి మా పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించారు. నేను సైకియాట్రిస్ట్‌ని, చాలా మంది ద్వంద్వ జీవితాన్ని గడపడం గురించి నాతో మాట్లాడతారు. ఎందుకంటే వారు తమకు తాముగా నిలబడలేరు."అని పరోమిత భాగస్వామి సుర్భి మిత్ర అన్నారు.
కొన్ని వారాల క్రితం.. ఒక స్వలింగ సంపర్కులు హైదరాబాదులో జరిగిన ఒక సన్నిహిత వివాహ వేడుకలో మొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెళ్లి చేసుకున్నారు. డిసెంబరు 18న హైదరాబాద్ శివార్లలోని రిసార్ట్‌లో అభయ్ డాంగే (34), సుప్రియో చక్రవర్తి (31) ఉంగరాలు మార్చుకున్నారు. భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లేదు కాబట్టి, ఇద్దరు వ్యక్తులు "ఆశాజనకమైన వేడుక" నిర్వహించారు. వారి ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ సంబంధం అది. పంజాబీకి చెందిన అభయ్, ఇ-కామర్స్ సంస్థలో పనిచేసే ఐటీ ప్రొఫెషనల్ అయితే, బెంగాలీకి చెందిన సుప్రియో హాస్పిటాలిటీ ప్రొఫెషనల్. వీరి వివాహాన్ని సోఫియా డేవిడ్ అనే ట్రాన్స్ ఉమెన్ అధికారికంగా నిర్వహించారు.