మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో గత 24 గంటల్లో చిరుతపులి దాడిలో ఒక టీనేజీ యువకుడు చనిపోగా.. 55 ఏళ్ల మహిళను పులి చంపిందని అటవీ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం అర్థరాత్రి వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ మైదానంలో కూర్చున్న రాజు బద్ఖే (16)ను చిరుత పొదల్లోకి లాక్కెళ్ళిందని.. శుక్రవారం ఉదయం అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చంద్రపూర్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కరేకర్ తెలిపారు. "మేము మృతుడి బంధువులకు ప్రాథమిక నష్టపరిహారంగా ₹ 20,000 అందించాము. చిరుతపులిని ట్రాక్ చేయడానికి పట్టుకోవడానికి మేము కెమెరాలు, ట్రాప్‌లను ఉంచాము" అని అధికారి తెలిపారు.
రెండవ ఘటనలో ముల్ తహసీల్‌లోని కోశాంబి గ్రామంలో జ్ఞానేశ్వరి మోహుర్లే (55) ను పులి చంపేసింది. ఆమె కుటుంబానికి ప్రాథమిక పరిహారంగా ₹ 30,000 అందించినట్లు RFO ప్రియాంక వెల్మే తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం చంద్రాపూర్ ఎమ్మెల్యే కిషోర్ జోర్గేవార్ ఆ ప్రాంతంలో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడారు. ఈ ఘటనలతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు భయంతో వణికిపోతూ ఉన్నారు. ఎలాగైనా వాటిని బంధించాలని గ్రామస్తులు అధికారులను కోరుతూ ఉన్నారు.