సోమవారం తెల్లవారుజామున ఒకటిన్నర సంవత్సరం ఉన్న బాలికను చిరుతపులి చంపేసింది. ఈతిఖా అఖిలేష్ లాట్ అనే బాలిక తన ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో విగతజీవిగా కనిపించింది. మహారాష్ట్రలోని గోరేగావ్ జిల్లా ఆరే కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగినప్పుడు బాలిక తన తల్లితో కలిసి సమీపంలోని ఆలయానికి వెళ్ళింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. అటవీ శాఖ బృందం ప్రకారం, ఆ చిరుత పులిని పట్టుకుని బోరివలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌కు పంపారు. అధికారులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరే కాలనీలోని డెయిరీ యూనిట్ నంబర్ 15లో కుటుంబం నివాసం ఉంటోంది. ప్రస్తుతం సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (SGNP) నిర్వహణలో ఉన్న ఆరేలోని అటవీ ప్రాంతానికి ఈ గ్రామం సరిహద్దుగా ఉంది. దాడి తర్వాత బాలికను మరోల్స్ సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఆమె చేరిన కొద్దిసేపటికే మరణించింది. సిద్ధార్థ్ హాస్పిటల్‌లో జరిగిన పోస్ట్‌మార్టం పరీక్షలో మరణానికి కారణం గాయం, విపరీతంగా రక్తం పోవడం అని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో సాధారణంగా ఐదు చిరుతపులులు ఉంటాయని అధికారులు తెలిపారు. చీకటిగా ఉన్నప్పుడు తమ పిల్లలను బయటకు తీసుకుని రావద్దని స్థానికులను కోరుతున్నామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా పులులను పట్టుకుంటామని అన్నారు.